మైనార్టీల సంరక్షణే ధ్యేయమా ?

ఈ మధ్య సాక్షాత్ మన గృహమంత్రి చిదంబరం గారు ఒరిస్సా లోని కన్థమాల్ కు వెళ్లారు. అందులో ముఖ్యంగా క్రైస్తవులు రక్షణ పొందుతున్న సహాయ శిబిరాలకు వెళ్లి, వాళ్ళపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పారు. తిరిగి వాళ్ళ గూడేలకు వెళ్ళి చర్చిలు నిర్మాణం చేసుకొని ప్రశాంతంగా జీవించండి అని చెప్పారు. ఈ విషయం బాగానే ఉన్నది. కంధమాల్ లో జరిగిన గొడవలకు మూల కారణం స్వామి లక్ష్మణానంద సరస్వతిని, అయన శిష్యులు నలుగురిని హత్య చేయటం. దాని కారణంగా కోపోద్రిక్తులైన గిరిజనులు చేసిన దాడి అది. అసలు విషయాన్నీ ప్రక్కకు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. స్వామీజీ హత్యకు కనీసం సానుభూతి కూడా తెలియ చేసేందుకు ఆ ఆశ్రమానికి గృహమంత్రి గారు వెళ్ళలేదు. వెళ్ళాలని అనిపించి ఉండకపోవచ్చు. ఎందుకంటే తమ పార్టి గెలవటానికి కారణం క్రైస్తవుల మరియు ముస్లింల వోట్ బ్యాంకే. కాబట్టి వారి మెప్పు పొందటం తమ తక్షణ కర్తవ్యమని గృహ మంత్రి గారు భావించి ఉంటారు. ఈ దేశంలో హిందువు ఏమైనా ఫరవాలేదు అని అనుకొని ఉంటారు. అందుకే ఇట్లా చేసి ఉంటారు. ఇదీ ఈరోజు హిందువుల యెడల ఈ దేశ పాలకుల నీతి.

No comments: