గాంధీ మెడికల్ కాలేజీలో క్రైస్తవ మత ప్రచారానికీ ప్రయత్నించినా ఓ వైద్యుడిని విద్యార్ధులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని దక్కన్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డేవిడ్ రాజు, గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న ఒక వైద్యుడు, మరి కొంతమందితో కలిసి శనివారం మధ్యాహ్నం కళాశాలకు వచ్చివిద్యార్థులతో సమావేశమై వారికి మత పరమైన కరపత్రాలు, పుస్తకాలూ పంపిణి చేసి మతం గురించి వివరించ సాగారు. విషయం తెలిసిన విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి శ్రీ మురళీధర్ అక్కడకు చేరుకుని కాలేజీ క్యాంపస్ లో మత ప్రచారం ఏమిటని నిలదీశారు. దీంతో డేవిడ్ రాజు, మరి కొందరు మురళీధర్ తో వాగ్వాదానికి దిగారు. అయితే మరికొందరు విద్యార్ధులు, విద్యార్ధి నాయకులూ, పోలిసులు అక్కడకు చేరుకోవడంతో డేవిడ్ రాజు మరోసారి ఇలా చేయనని క్షమాపణ కోరారు. దీంతో పోలీసులు అతడిని పంపి వేశారు. అనంతరం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రదీప్ దేశ్పాండే ముగ్గురు ప్రోఫెసర్లతో కూడిన కమిటీని నియమించారు. కాలేజీలో మత ప్రచారం జరుగుతున్నా తీరుపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించిన తరువాత తగు చర్యలు తీసుకుంటామని ప్రదీప్ దేశ్పాండే చెప్పారు.
కాగా రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలిసింది. పిజి విద్యార్థులు వసతి గృహం లోని 6 వ నెంబర్ గదిలో అన్య మతానికి చెందినా పుస్తకాలూ, సామగ్రిని గుర్తించారు. పేద విద్యార్థులను ఫీజులు, పుస్తకాల సాయంతో ఆకర్షించి, తద్వారా మతం లోకి మార్చుతున్నారని పలువురు విద్యార్ధులు పేర్కొన్నారు. గతంలోనూ రోగుల వార్దుల్లోకి వెళ్లి కొందరు మత ప్రచారం నిర్వహిస్తుండగా విద్యార్ధులు పట్టుకున్నారు.
గాంధీ మెడికల్ కాలేజీలో క్రైస్తవ మత ప్రచారం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment