గో వంశ రక్షణకు కదిలిన స్వామీజీలు

విజయ దశమి నుండి సంక్రాంతి వరకు - కురుక్షేత్రం నుండి నాగపూర్ వరకు విశ్వ మంగళ గోగ్రమ యాత్ర
భారత దేశంలో బ్రిటిష్ పాలనా సమయం లోనే గోవధ శాలలు ప్రారంభమైనాయి. 50 సంవత్సరాల ముస్లింల పాలనలో కూడా గోహత్య లను ప్రోత్సహించలేదు. అనేక మంది దానిని నిషేధించారు. 1760 సంవత్సరం నుండి బ్రిటిష్ కాలంలోగో వధ శాలలు ప్రారంభమైనాయి. 1857 స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి గోహత్య నిషేధాన్నిప్రకటించడం గమనార్హం. తదుపరి ఆర్య సమాజ్ ప్రారంభించిన స్వామి దయానంద సరస్వతి 1881 నుండి 1894 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. సమయంలో గో సంరక్షణ ఆవశ్యకతను తెలియ చేస్తూగోకరుణ" అనే గ్రంథాన్ని రచించారు. దయానంద సరస్వతి ప్రారంభించిన గోసంరక్షణ ఉద్యమం ఉత్తర భారతంలోఉధృతంగా సాగింది. దానిలో అనేకమంది ముస్లిం పెద్దలు, పార్శీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఉద్యమం 14 సంవత్సరాల పాటు సాగింది. ఉద్యమంతో బ్రిటిష్ ప్రభుత్వం కదిలింది. బ్రిటిష్ రాణి విక్టోరియా వైస్రాయ్ తో చర్చించిముస్లింలు గోవులను చంపుతున్నారని, కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నదనే అభిప్రాయం తప్పు. అదిమనకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళన. అది మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణం కావచ్చు. కాబట్టి దానినిఅణచివేయాలని సూచించారు. తదుపరి ఆంగ్లేయ అధికారులు ఉద్యమాన్ని అణచివేశారు. హిందువులు - ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు చిన్న అవకాశం లభించినా బ్రిటిష్ వారు వదులుకోలేదు అని చెప్పేందుకుఇది ఒక ఉదాహరణ. 1917 సంవత్సరం అంటే దాదాపు 24 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీజీ బీహారులోమాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు ప్రతి రొజూ 30,000 ఆవులను చంపుతున్నారని చెప్పారు. దీనిపై అభ్యంతరంతెలియచేశారు. తదుపరి స్వాతంత్ర్యానంతరం 1952 సంవత్సరంలో దేశంలో స్వామీజీల నాయకత్వంలో పెద్దయెత్తున సంతకాల సేకరణ జరిగింది. ఒక " కోటికి పైగా చేసిన సంతకాల పాత్రలను ఎడ్లబండిలో రాష్ట్రపతి భవనానికితీసుకువెళ్ళి డా.బబూ రాజేంద్ర ప్రసాద్ కు సమర్పించారు. అప్పటినుండి అప్పుడప్పుడు ఆందోళనలు జరుగుతూనేఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచి, గోవులను రక్షిస్తామని ప్రజల చేత ప్రమాణం చేయిస్తూ, గో ఆధారితవ్యవాసం, దాని వల్ల లాభాలు వివరిస్తూ ప్రజలలోకి వెళ్లేందుకు 150 సంవత్సరాల తరువాత మల్లి మరో ఉద్యమంప్రారంభం కాబోతుంది.
భారత దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి 62 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో మరో స్వాతంత్ర్యసంగ్రామం ప్రారంభించటానికి దేశంలో ప్రముఖులైన స్వామీజీలు నిర్ణయించారు.
ప్రముఖులైన స్వామీజీల సందేశాల సారాంశం :
భారత దేశం ప్రపంచానికి ఆత్మ వంటిది. గ్రామము భారత దేశము యొక్క ఆత్మ. వ్యవసాయం గ్రామానికి ఆత్మ. గోవు వ్యవసాయానికి మూలాధారం. అంటే గోవు ప్రపంచానికి ఆత్మ వంటిది. అటువంటి గోవు ఈరోజున ప్రపంచమంతట వదిన్చబడుతున్నది. రైతు పంటలు సరిగా పండక అప్పుల పాలై అత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా వినాశకర, విపత్కర మార్గంలో పయనిస్తున్నది. మనం ఆనందకరంగా జీవించాలంటే గోహత్యాలు అపబడాలి. దేశంలో రైతు ఆత్మగౌరవంతో నిలబడాలి. గ్రామాలు మల్లి కళకళలాడాలి. ఈరోజున ప్రపంచమంతా పర్యావరణ సమస్యలు పెరిగి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. భూసారం నష్ట్రపోతున్నది. వాతావరణ కాలుష్యం ఏర్పడింది. అడవులు ధ్వంసమై పోతున్నాయి. నీళ్లు కలుషితమయి పోతున్నాయి. ప్రకృతిలోని గాలి, నీరు, భూమి, అడవులను కాపాడుకోవడం ఈరోజు ప్రపంచంలోని మనందరి కర్తవ్యము. దీనికోసం ప్రక్రుతి నియమాలను కాపాడడం మనందరి కర్తవ్యం. అందుకే దేశంలోని ప్రముఖులైన స్వామీజీలు అందరు కదిలారు. గోమాతను రక్షించుకొంటూ తద్వారా ప్రకృతిని, సృష్టిని కాపాడుకుందాము. విషయాలను స్వయంగా తెలియాచేసెనదుకు స్వామీజీలు కదిలారు. "గోవును కాపాడు - దేశాన్ని రక్షించు" అనే నినాదంతో "విశ్వ మంగళ గోగ్రామ యాత్ర " ప్రారంభం కాబోతున్నది.
యాత్ర వివరాలు : యాత్ర సెప్టెంబర్ 28 తేది విజయ దశమి పర్వదినాన కురుక్షేత్రం నుండి ప్రారంభము కానున్నది. యాత్ర సంక్రాంతి పండుగ రోజున నాగపూర్ లో ముగించబడుతున్నది.
యాత్ర 108 రోజులు సాగుతుంది. 20,000 కిలోమీటర్లు తిరుగుతుంది. 400 ప్రసిద్ధ స్థలాలగుండా సాగుతుంది. యాత్ర కమిటి ఉపాధ్యక్షులు శ్రీ హుకుం చంద్ సనల్ యాత్ర మార్గం గురించి వివరిస్తూ "యాత్ర నలుగు శంకర పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు అనేక పుణ్య నదులు, ప్రవతలు సందర్శిస్తూ సాగుతుంది". యాత్రలో ఒక రథంలో గోమాత విగ్రహము, రెండవ రథంలో గోమాతకు సంబంధించిన సాహిత్యమూ, గ్రామాభివృద్ధికి గోవు యెట్లా ఆధారం వివరించే సాహిత్యం తదితరములు, మూడవ రథంలో స్వామీజీ ఉంటారు. ఈ కార్యక్రమానికి రాందేవ్ జీ బాబా, మాతా అమృతానందమయి, గోకర్ణ పీఠాధిపతి రాఘవేశ్వరభారతి, స్వామి దయానంద సరస్వతి, సంత మురారి బాపు, ఆచార్య మహాప్రదాన, గాయత్రీ పరివార్ స్వామీజీ ప్రణవ్ పాండ్య తదితర అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. స్వామీజీలందరూ దేశ ప్రజలకు "గో రక్షణ వైపు మల్లండి, గోవును కాపాడండి, గ్రామా స్వరాజ్యం సదిద్దము, రామ రాజ్యం నిర్మాణం చేద్దాము" అని పిలుపునిస్తారు. గ్రామాలలో ప్రజలందరి చేత గోవును కాపాడటము, ఎట్టి పరిస్థితులలోను గివును కోటకు అమ్మము అని ప్రతిజ్ణ చేయించబోతున్నారు. ప్రధాన యాత్రతో అనుసంధానం చేసుకుంటూ ఉప యాత్రలు ఉంటాయి. అటువంటివి దేశ వ్యాప్తంగా 15,000 వుంటాయి. ఈ యాత్ర దేశమంతట ఒక లక్ష కేలోమీటర్లు సాగుతుంది. ఈ సమయంలో గో సంరక్షణకు సంతకాల సేకరణ జరుగుతుంది. ఆ సంతకాలను ప్రధాన రథంలో వచ్చే స్వామీజీకి ఇవ్వటం జరుగుతుంది. దేశంలోని 5 లక్షల గ్రామాలలో సంతకాల సేకరణ చేయబడుతుంది. సుమారుగా 21 కోట్ల మందితో సంతకాల సేకరణ చేయాలనీ సంకల్పం. ఈ సంతకాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అందచేస్తారు. దేశమంతట గోహత్యను నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేయటం జరుగుతుంది. 50 కోట్ల మందో ప్రజల చేత గ్రామీణ సంస్కృతిని కాపాడుకుంతము, గో సంరక్షణ చేస్తామని ప్రతిజ్ణ చేయిస్తారు. ఈ యాత్ర గోభాక్తులు, స్వమీజీలతో నిర్వహించ బడుతుంది. గోవును ఎందుకు పెమించాలో వివరిస్తారు. గో ఆధారిత వ్యవసాయం, పండ్లు, కూరగాయలు యెట్లా పండించుకోవలో వివరిస్తారు. కుటుంబాలు గోప్రేమిక కుటుంబాలు కావాలి. ప్రతిరోజూ ఎవరు గోవును పోషిస్తారో అటివంటి వారిని గోశాలల ఏర్పాటుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఒక ప్రదర్శన శాల, వీడియొ, ఆడియో ల ద్వారా ప్రజలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక భవ్యమైన జాగరణ కార్యక్రమ ప్రయత్నాలు చాల వేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో మనమందరం పాల్గొని యాత్రను విజయ వంతం చేద్దాము.



Full Matter

భారతదేశ అంతర్గత వ్యవహారాలలో అమెరికా జోక్యాన్ని ఖండించాలి

భారతదేశంలో మైనార్టీ మతస్తులపై దాడులు జరుగుతున్నాయి. దాడులు ముఖ్యంగా గుజరాత్, ఒరిస్సాలలో జరిగాయి. ఆ దాడులపై ఆందోళన చెందుతున్నాము. కాబట్టి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలనీ అంతర్జాతీయ సంస్థ ఒకటి మన ప్రభుత్వాన్ని అడిగిందట. దానికి మన ప్రభుత్వం ఒప్పుకొని తేది కూడా నిర్ణయం చేసింది. అది ఈ జూన్ 12 వ తేది. ఎందుకో ఆ సంస్థకు వీసాలు మంజూరు కాలేదు. దానితో ఆ పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. దానిపైన అమెరికా లోని మన రాయబారి ఉద్దేశ్య పూర్వకంగా మాకు వీసలివ్వకుండా మా ప్రయాణాన్ని ఆపారు. మేము ఇండియా వెళ్ళటం వారికీ ఇష్టం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ పర్యటనను మన ప్రభుత్వం ఎందుకో ఆపింది. ఇంతకూ ఆ సంస్థ ఏమిటి?
ఆ సంస్థ పేరు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం, అది అమెరికన్ కాంగ్రెస్స్ చేత ఆమోదించ బడింది. ఆ సంస్థ ప్రపంచంలోని మతాలపై, వాటి కార్య కలాపాలపైనివేదికలు తాయారు చేసి అమెరికా ప్రభుత్వానికి ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో క్రైస్తవ మిషనరీల రక్షణకు అవసరమైన సహకారం అందించటం దాని లక్ష్యంగా కనబడుతున్నది. మన దేశంలో ఒరిస్సా లో, గుజరాత్ లో మైనార్టీలపై జరిగిన దాడులను అధ్యయనం చేయటానికి అంటే మన దేశం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, ఆ జోక్యాన్ని నిరకరించ వలసిన ప్రభుత్వం యెట్లా అంగీకరించింది? ఏ కారణాల వల్ల ఆపిందో ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు తెలియచేయాలి.
ఇటువంటి సంస్థ సహకారము, అంతర్జాతీయ నిధులు, అండదండలు చూసుకొని ఇక్కడి క్రైస్తవ మిషనరీలు విచ్చల విడిగా తమ కార్య కలాపాలు సాగిస్తున్నాయి. వారికిఇక్కడి ప్రభుత్వాలూ పరోక్ష మద్దతునిస్తున్నాయి. కాబట్టే మత మార్పిడులు ఆగటం లేదు. ఈ పరిస్థితులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఆత్మ రక్షణకు ఎప్పుడు సన్నద్ధం అవుతారు?

Full Matter

ఆధునికత పేరుతో అనర్ధాలు కొనితెచ్చుకుంటున్నాము

స్వాతంత్ర్యము సాధించుకొని 62 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ భావదస్యం నుండి బయట పడలేక పోవటం ఒక విచిత్రమైన విషయం. స్వాభిమానంతో వ్యవహరించటం నేర్చుకోవటంలో వెనక బడుతున్నాము. దానికి దారి తీసిన కారణాలలో "ఆధునికత" ఒకటి.
ఆధునికత పేరుతో ఈ దేశంలో ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు జరుగుతున్నా అనర్ధాలను మనం గుర్తించలేక పొతే మనం మన మూలల నుండి వేరుపడి విచ్చిన్నమై పోతాము. ఈ అనర్థాలను చక్కదిద్దేందుకు మనం ప్రయత్నం చేయాలనీ ప్రముఖ మనో విజ్ఞాన శాస్త్రవేత్త, బహు గ్రంథ కర్త, వివిధ దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న "ఆసిస్ నంది" ఈ మధ్య భాగ్యనగర్ వచ్చినప్పుడు చెప్పారు.
వివరాలు సంక్షిప్తంగా :
బ్రిటిష్ పాలకులు మన దేశంలో అమలు పరిచిన వలసవాదం విడిచి వెళ్ళిన అవసేశంగా నేను ఆధునికతకు గుర్తిస్తాను. ఆధునికత అనేది మన దేశ వాసులను మన సంప్రదాయం నుండి వేరు చేసింది. మన మూలల నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది. హేతువు పేరా, శాస్త్రం పేరా నవీన సంప్రదాయాన్ని సృష్టించి దానికి మనలను బానిసలను చేసింది. ఆంగ్ల విద్య, ఆంగ్లేయ వైద్యం, సంక్షేమం, అభివృద్ది, ఆర్ధిక పురోభివృద్ధి, మార్కెట్ రాజ్యం వంటి భావనలను ఆధిపత్య స్థానంలో ఉంచి వాటికి ప్రజలతో ఉడిగం చేయిస్తున్నది.
ఈ ఆధునికత సృష్టిస్తున్న అనర్ధాలు గతంలో సంప్రదాయాలు సృష్టించిన అనర్ధాలను మించి పోయి వలసవాద సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడి నెలలో, గాలిలో బలీయంగా నాటుకోకుండా చూడవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. మనదైన జీవన విలువలను గుర్తించి వాటిని వికశింప చేసుకొనేందుకు కృషి చేయాలి.


Full Matter

భగవద్గీత శిక్షణా కేంద్రం

సంస్కృత భారతి - ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో "గీతా శిక్షణ కేంద్రం" పేర భగవద్గీత గురించి పూర్తిగా తెలుసుకొనే విధంగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణా తరగతులు జూలై మాసంలో దేశ వ్యాప్తంగా 2 వేల కేంద్రాలలో ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ ద్వారా సంసృతం మరియు భగవద్గీత గురించి ఒకే సమయంలో తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ శిక్షణ తరగతులలో చేరడానికి ఎటువంటి వయోభేదం లేదు.
పూర్తి వివరాలకు సంప్రదించవలసిన చిరునామా :
సంస్కృత భారతి, 4-2-72, బడిచౌడి, సుల్తాన్ బజార్, హైదరాబాద్ - 500 095.
ఫోన్ : 040-24750111. సెల్ : 9866140406, 9490192622, 9440424587.


Full Matter

స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో గల్ఫ్ బాధితులపై సర్వే

బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి సర్వస్వం కోల్పోయి ఆత్మ హత్యలు చేసుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ డిమాండ్ చేస్తున్నది.
కరీంనగర్, నిజామాబాదు జిల్లాల నుండి 3 లక్షలకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్ళారని నకిలీ ఏజెంట్ల చేతులలో మోసపోతున్నారని సుమారుగా లక్ష యాభై వేళ ఫైచిలుకు గల్ఫ్ బాధితులు ఉన్నారని స్వదేశీ జాగరణ మంచ్ పేర్కొన్నది.
మే 26 వ తేదీన నిజామాబాదు జిల్లా పెర్కిస్ నుండు ప్రారంభమై 15 బృందాలు 400 గ్రామాలను సందర్శించి 16,000 మంది బాధితులను కలసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకొని ఒక సర్వే నిర్వహించడం జరిగింది. నందిపేట మండలం లో 14,800 మంది, సదాశివ నగరంలో 20,000 మంది, భీమ్గల్ 15,000, దార్పల్లి, గిరికళ్ళ మండలాల్లో 15,000, నిజామాబాదు మండలాల్లో 14,000, డిచ్పల్లిలో 14,800, మేడ్చల్లో 16,000 మంది, కమ్మర్పల్లిలో 10,000, వేల్పుర్లో 6,000, జక్రద్ పల్లిలొ 4,000, ఆర్మూర్ 20,000, మకులూర్ లో 15,000, బల్మండలో 20,000, నిజామాబాదు అర్బన్ లో 20,000 మంది వరకు గల్ఫ్ బాధితులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు.
జిల్లాల్లో దాదాపు 200 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసింది. స్వదేశీ జాగరణ మంచ్ గల్ఫ్ బాధితుల పక్షాన ఉద్యమం కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర కో-కన్వీనర్ శ్రీ నరసింహ నాయుడు పేర్కొన్నారు.

Full Matter