భారతీయులపై ఆస్ట్రేలియా దేశంలో జరుగుతున్నవరుస దాడులపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దల్వీర్ భండారి, జస్టిస్ ఏ.కే.గంగూలీ లు 29-06-2009 సోమవారం నాడు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
"భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల విషయంలో యు.పి.ఏ. ప్రభుత్వం ఏమయినా చేస్తున్నదా? విద్యార్థులు తల్లి దండ్రులు స్వాంతన పొందే విధంగా గట్టి ప్రయత్నం ప్రభుత్వం నుండి ఏమయినా జరుగుతున్నదా? లేని పక్షంలో తగు చర్యలు వెంటనే చేపట్టాలి" అని ప్రభుత్వం అటార్నీ జనరల్ శ్రీ జి.ఈ. వాహనతో న్యాయమూర్తులు అన్నారు. ప్రభుత్వానికి ఖచ్చితమైన అవగాహనా ఉందావిషయం ఏమిటో తేల్చి చెప్పండి. "తివాచి క్రిందికి సమస్యని త్రోసివేయ్యడం" కూడదు అన్నారు. శ్రీ రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి పెట్టుకున్న పిటిషన్ పై విచారిస్తున్న న్యాయమూర్తులు ఇంక ఇలా అన్నారు. "జరుగుతున్నదేమిటో ఏమవుతున్నదో సరిగ్గా తెలుసుకొని తదనుగుణమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలి". ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియాలో స్థిరపడిన విద్యార్ధి శ్రీ ప్రదీప్ అహ్లన్త్కోర్టుకు విజ్ఞాపన చేస్తూ "భారత ప్రభుత్వం సమస్య మూలాలను తెలుసుకోకుండా ఇంతటి సంక్లిష్టమైన చిక్కు సమస్య పరిష్కరించడానికి అన్యమనస్కంగా ప్రయత్నిస్తోంది" అని అన్నారు. కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ప్రదీప్ యొక్క అభిప్రాయాలూ సంపూర్ణంగా ఒక అఫిడవిట్ ద్వార సమర్పించాలని సూచించారు.
గత కొంతకాలంగా ఆస్ట్రేలియా దేశంలో మన వారిపై దాడులు వరుసగా జరుగుతున్నా వైనం పత్రికలూ మరియు ప్రసార మాధ్యమాల ద్వార మనం వింటున్నాం. మన ప్రభుత్వం నిర్లిప్తత, సమస్య పట్ల నిరాసక్తత కూడా గమనించాంఇంతకూ ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? భారతీయుల మీద మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? ఇవి నిజంగా జాత్యహంకార దాడులేన లేక వేరే కారణాలేమయినా ఉండవచ్చా? జాత్యహంకారమే అయితే ఇతర దేశస్థుల మీద కూడా జరగాలి కదా! ఈ ప్రశ్నలు సహజంగానే ఎవరికైనా కలుగుతయే. వేరే దేశంలో ఉంటున్న తమ వారిపై ఏ చిన్న దడి జరిగినాపాశ్చ్యాత్య దేశాల వారు సత్వరమే తీవ్రంగా స్పందిస్తారు. భారత్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నం. అయితే ఒక సవరణ మాత్రం ఉన్నది.
మహమ్మదీయ సోదరులకు చిన్నమెత్తు బాధ కలిగిందనిపిస్తే మన ప్రభుత్వం ఆఘమేఘాల మీద అప్రమత్తం అవుతుంది. మన ప్రధాని గరికయితే రాత్రి నిద్ర పట్టాడు. తిండి నోటికేక్కదు. ఇంతకీ ఆస్ట్రేలియాలో జరుగుతున్నది ఏమిటి? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వస్తావా కోణం నుంచి చూస్తే, ఒక ఆశ్చర్యకరమయిన అంశం మనకు తెలుస్తూంది.
ఆస్ట్రేలియాలో ఇంట జరుగుతున్నా ఎన్నో పత్రికలూ, మాధ్యమాలు కథనాలు వినిపిస్తున్న ఆ దేశంలో ఎప్పటినుంచో స్థిరపడిన భారతీయ సంపన్నులు,మేధావులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారే కానీ ఏమి మాట్లాడటం లేదు. ఈ విషయంలో వారిని కదిపితే, సమస్య యొక్క ఇంకొక పార్శ్వం వెలుగులోకి వచ్చింది. ఈ పాత తరం స్థిరపడ్డ భారతీయులకు భాష, ప్రాంతం ఆధారంగా 24 సంఘటనలు ఉన్నాయి. వీటనన్నిటిని కలుపుతూ United India Association అనే ఒక మహా సంఘం ఉన్నది. వీరి అభిప్రాయాలూ ఇలా ఉన్నాయి.
తరువాయి వివరాలు వచ్చే మాసంలో .....
భారతీయులపై ఆస్ట్రేలియాలో దాడులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment