బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి సర్వస్వం కోల్పోయి ఆత్మ హత్యలు చేసుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ డిమాండ్ చేస్తున్నది.
కరీంనగర్, నిజామాబాదు జిల్లాల నుండి 3 లక్షలకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్ళారని నకిలీ ఏజెంట్ల చేతులలో మోసపోతున్నారని సుమారుగా లక్ష యాభై వేళ ఫైచిలుకు గల్ఫ్ బాధితులు ఉన్నారని స్వదేశీ జాగరణ మంచ్ పేర్కొన్నది.
మే 26 వ తేదీన నిజామాబాదు జిల్లా పెర్కిస్ నుండు ప్రారంభమై 15 బృందాలు 400 గ్రామాలను సందర్శించి 16,000 మంది బాధితులను కలసి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకొని ఒక సర్వే నిర్వహించడం జరిగింది. నందిపేట మండలం లో 14,800 మంది, సదాశివ నగరంలో 20,000 మంది, భీమ్గల్ 15,000, దార్పల్లి, గిరికళ్ళ మండలాల్లో 15,000, నిజామాబాదు మండలాల్లో 14,000, డిచ్పల్లిలో 14,800, మేడ్చల్లో 16,000 మంది, కమ్మర్పల్లిలో 10,000, వేల్పుర్లో 6,000, జక్రద్ పల్లిలొ 4,000, ఆర్మూర్ 20,000, మకులూర్ లో 15,000, బల్మండలో 20,000, నిజామాబాదు అర్బన్ లో 20,000 మంది వరకు గల్ఫ్ బాధితులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు.
జిల్లాల్లో దాదాపు 200 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసింది. స్వదేశీ జాగరణ మంచ్ గల్ఫ్ బాధితుల పక్షాన ఉద్యమం కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర కో-కన్వీనర్ శ్రీ నరసింహ నాయుడు పేర్కొన్నారు.
స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో గల్ఫ్ బాధితులపై సర్వే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment