గోహత్య మహా పాతకం. గోవు తల్లితో సమానం. ఆదరించి పోషించాలి తప్ప, హింసించి వధిన్చరాదన్నది సనాతన హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడతమంటూ కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రభుత్వాలు ఉన్న భారత దేశంలో ఆవుల రక్షణ వట్టి నినాదమే అయింది. కానీ రష్యాలో మాత్రం గోరక్షణ జీవ కారుణ్య చట్టాలు బాగానే అమలవుతున్నాయని అనడానికి నిదర్శనంగా ఈ క్రింది సంఘటనను పేర్కొనవచ్చు.
జుల్పత్ కల్బయేవ్ అనే వ్యక్తి ముస్లిములు ఎక్కువగా ఉండే తతరిస్తాన్ లోని మారుమూల ఉన్న ఒక గ్రామంలో ఉండేవాడు. ఒకనాడు అతనో అవును ఇనుప కడ్డితో దారుణంగా కొట్టాడు. దాంతో వెన్నెముక విరిగి విలవిలలాడి అది చచ్చిపోయింది. ఈ నేరానికి గాను కోర్టు అతనికి ఆరు నెలల శిక్ష విధించింది. ఈ కాలంలో అతను కష్టపడి పని చేయాలి. జీవహింసకు పాల్పడినందుకు సంపాదించిన దాంట్లో పదో వంతూ జరిమానా కింద చెల్లించాలి అని తీర్పు చెప్పింది.
మరి ఇండియాలో రోజు వెలది గోవులు వధకు గురవుతున్న నేరస్తులకు ఇలాంటి శిక్షలు విధించడం ఎక్కడైనా చూశామా ? వార్త దినపత్రిక సౌజన్యంతో..
రష్యాలో గోహత్యకు శిక్ష
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment