ఇంటర్ ఫెయిత్ చర్చలలో కంచి స్వామీజీ స్పష్టమైన ప్రతిపాదనలు

అత్యంత ప్రాధాన్యం కలిగిన ఒక సమావేశం జూన్ 12 న ముంబై లో జరిగింది. ఇంటర్ రిలీజియన్ డైలాగ్ కోసమని వాటికన్ పొంతిఫికాల్ కౌన్సిల్ అధ్యక్షులైన కార్డినల్ జీన్ లూయి పియెర్రెతరన్ వచ్చి కంచి శంకరాచార్యులను (జయేంద్ర సరస్వతి స్వామి) మరికొందరు హిందూ ధర్మ ప్రతినిధులనూ కలిశారు. వారి మధ్య జరిగిన చర్చలలో మతం మార్పిడి చేస్తున్నది ప్రోటేస్తేంట్ క్రైస్తవులని అయన చెప్పారు. అలాగైతే కార్డినల్ వాటికన్ కు తిరిగి వెళ్ళిపోయి, అన్ని రకల క్రైస్తవ ప్రముఖులను వెంట తీసుకొని వచ్చి చర్చలలో పాల్గొనటం సముచితంగా ఉంటుందని కంచి స్వామి నిష్కర్షగా చెప్పారు. భారత జాతీయ ప్రభుత్వం తరఫున ఏయే అంశాలను లేవనేత్తవలసి ఉందో, ఆ అంశాలన్నీ కంచి స్వామి లేవనెత్తారు. మరి తాము కూడా ఈ విషయంలో కర్తవ్యమ్ నిర్వహించ గలమని నిరుపించుకోవలసిన బాధ్యత యూ పి ఏ ప్రభుత్వంపై ఉన్నది.
సందర్భంగా కంచి స్వామీజీ ప్రస్తావించిన విషయాలు (సంక్షిప్తంగా) : మే 12, 2009 న పోప్ బెనెడిక్ట్ XVI ఏసుక్రీస్తు జన్మస్థలమైన ఇజ్రాయెల్ వెళ్లారు. అక్కడ యూదులు, క్రైస్తవుల మధ్య సామరస్యానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ చర్చలలో ఒక అంగీకారానికి వచ్చారు. దాని తదుపరి యూదుల ప్రతినిధి పత్రిక విలేకరుల సమావేశంలో పోప్ బెనెడిక్ట్ కూడా ఉన్నాడు. దాని సారాంశమేమంటే, - "ఇజ్రాయెల్ లో పని చేస్తున్న క్యాథలిక్ మిషనరీలను ఉపసంహరించు కుంటున్నాము. యూదులను క్రైస్తవులుగా మతం మార్పిడులు చేయటం విరమిస్తాము" అని. ఇజ్రాయెల్ దేశంలో క్రైస్తవులు - యూదులు కలసి సామరస్యంగా ఉండాలని కోరుకొంటున్నారు అని ప్రకటించారు. ఈ విషయాన్నీ బొంబాయిలో జరిగిన హిందూ మత పెద్దలు, క్రైస్తవ పెద్దల సమావేశంలో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామి ప్రస్తావిస్తూ, భారత దేశంలోని క్రైస్తవులు కూడా అటువంటి ప్రకటన చేయాలనీ సూచించారు. వారు ఇంకా మాట్లాడుతూ భారత దేశంలో హిందూ ధర్మ గ్రంధాల లోని పదజాలం ఉపయోగించి ఒక బైబిల్ తయారు చేసారు. దానిలో వేద, ఆగమ, ఋషి, ఆశ్రమము, ఓం మొదలైన పదాలు హిందూ దేశానికి, ఇక్కడి ధర్మానికి చెందినవి. వాటిని ఉపయోగించి ఒక బైబిల్ వ్రాయటం ఇక్కడి సామాన్య హిందువులను తప్పుదారి పట్టించి మత మార్పిడులు చేయటానికి చేసే ప్రయత్నం. ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ బైబిల్ పుస్తకాలను వెనుకకు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇటువంటి ప్రయత్నాలు ఇకముందు జరుగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముగింపు : స్వామీజీ ప్రస్తావించిన అంశాలపై దేశ వ్యాప్తంగా లోతైన చర్చ జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది.


No comments: