శ్రీ కృష్ణ దేవరాయ పట్టాభిషేక పంచ శత వార్షికోత్సవము
క్రీ.శ. 1336 వ సంవత్సరంలో విద్యారణ్య స్వామి, శృంగేరి శంకర పీఠము ప్రేరణతో ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యమును అన్ని విధాల ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనుడు శ్రీ కృష్ణ దేవరాయలు. "హిందూ రాయ సురత్రణ" అనే బిరుదుతో విభుషితుడైన శ్రీ కృష్ణ దేవరాయలు ఆదర్శ హిందూ సామ్రాట్టులకు ఒక ప్రతీక. కృష్ణ దేవరాయలు పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ చరిత్రను ఒకసారి మననం చేసుకుందాం. రాబోవు నెల నుండి (ఆగస్ట్ 2009) మన పత్రికలో కొన్ని వివరాలు అందచేస్తాము
రామజన్మ భూమి వివాదంపై కోర్టు తీర్పు కూడా త్వరగా వచ్చేటట్లు చూడాలి
1992 డిసెంబర్ 6 నాడు బాబరీ కట్టడం కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపేందుకు అప్పటి ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు నియమించిన లిబర్హాన్ కమీషన్ 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం విచారణ అనంతరం ఎట్టకేలకు పూర్తిచేసి ఆ నివేదికను ప్రస్తుత ప్రధానికి అందచేసింది. ఈ విచారణ నిర్వహించేందుకు 10 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నివేదిక కట్టడం కూల్చివేతకు సంబంధించింది మాత్రమే. అసలు ఆ స్థలము రాముడి జన్మస్తలమా అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు లో జరుగుతున్నవిచారణకు సంబంధించిన తుది తీర్పు కూడా త్వరగా వచ్చేటట్లు చూసి ప్రభుత్వం తన నిజాయితీని ప్రకటించుకోవాలి. అప్పుడే రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించడం సులభం అవుతుంది.
సంపాదకుని మాట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment