ఈ రోజున ప్రపంచంలో ఏ మూలన చూసినా ఆకలితో మాడే అన్నార్తుల ఆక్రందనలు, ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఆర్ధిక మాంద్యము దీనిని ఇంకా పెంచుతున్నది. ఐక్య రాజ్య సమితి అనుబంధ ఆహార సంస్థ తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఆకలితో అల్లాడుతున్నారు. రోజు ఆకలితో అలమటించే వారి సంఖ్య 2009 లో 102 కోట్లకు చేరుకుంది. భారత్ లో 23 కోట్ల మందికి సరియైన తిండి దొరకటం లేదు. భారత్ లో సరిపడా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ సరియైన పంపిణీ వ్యవస్థ లేకపోవటంతో అన్నార్తుల సంఖ్య పెరుగుతున్నది.
భారతావనిలో అన్నార్తులు :
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికీ భారత్ లో సరియైన తిండి లేని వారు 23 కోట్లు. (ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం అంచనా)
- ప్రపంచ ఆకలి సూచి నుండి కింద పేర్కొన్న 119 దేశాల జాబితాలో మనది 94 వ స్థానం.
- ప్రపంచంలో పౌస్తికాహార లోపంతో బాధపడే వారిలో 27% భారత్ లోనే ఉన్నారు.
- ఐదేళ్ళ లోపు పిల్లల్లో 43% ఉండాల్సిన బరువుకన్నా తక్కువగా ఉన్నారు.
- 2008-09 లో భారత్ లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 22.8 కోట్ల తన్నులు. 2015 నాటికీ దేశ ప్రజలకు 25 కోట్ల తన్నులు అవసరమవుతాయని అంచనా.
- లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టీ.పీ.డి.ఎస్.) తన లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయింది.
- భారత్ లో అందరికీ తిండి పెట్ట గలిగినంత ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నావిధాన పరమైన లోపల కారణంగా పేదలకు సరియైన ఆహారం దొరకడం లేదు.
ఈనాడు సౌజన్యంతో.....
ధరిత్రి ఆకలి కేకలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment