అగ్ని బాధితులను ఆదుకున్న సేవాభారతి, MCKS సంస్థలు


పాలమూరు జిల్లా, అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవులలోని గ్రామం "ఉడిమిల్ల". రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు ఆ గ్రామ ప్రజలు. తేది 10 జూన్ 2009 నాడు గ్రామ ప్రజలు ప్రభుత్వం తరుఫున జరుగుచున్న "కరువు పని" కొరకు కూలి పనికి వెళ్లారు. మిట్ట మధ్యాహ్నము 2 గంటల సమయంలో ఒక పూరి గుడిసెకు నిప్పంటుకుని బలంగా వీస్తున్న గాలి కారణంగా క్షణాలలో అనేక ఇళ్ళకు వ్యాపించింది. ఆ సమయంలో గ్రామ ప్రజలు ఎవరు వూరిలో లేరు. కేవలం పిల్లలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. రెండు ఇళ్ళలో గ్యాస్ సిలిండర్ ప్రేలిన కారణంగా మంటలు త్వరగా ఇతర ఇళ్ళకు వ్యాపించాయి. మొత్తం 57 ఇల్లు కాలి బుడిదయ్యాయి. ఇళ్ళలో ఉన్నా సామగ్రి అంతాకాలిపోయింది. చిన్న రైతులు తమ వద్ద గల వ్యవసాయ పని ముట్లు సర్వం కాలిపోయి పని చేసుకోవడానికి ఆధారం లేకుండా, పశువుల గ్రాసం పూర్తిగా కాలిపోయి, ఇంట్లో ఉన్నా ఆహారపు ధాన్యములు, వస్తువులు కాలిపోయి పూర్తిగా నిరాశ్రయులైనారు.
ప్రభుత్వం అందించిన అరకొర సహాయం కొన్ని కుటుంబాలకే చేరింది. మిగిలిన కుటుంబాలకు ఎటువంటి సహాయము అందలేదు. ఈ విషయం తెలుసుకున్న సేవా భారతి కేర్యకర్తలు గ్రామానికి వెళ్లి సర్వ్ చేసి నష్టపోయిన గ్రామ ప్రజలందరి కుటుంబాలకు వస్తు రూపేన సహకరించాలని నిర్ణయించారు. భాగ్యనగర్లోని MCKS food for hungry foundation సంస్థ వారి సహకారముతో మరియు సేవాభారతి పాలమూరు జిల్లా సంయుక్తంగా బాధితులకు వంట సామగ్రి, బట్టలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం తేది 24 జూన్ 2009 న శ్రీ టి.వి. దేశముఖ్, శ్రీ విద్వాన్ రెడ్డి మరియు MCKS కార్యకర్తల మార్గదర్శనంలో వారి చేతులమీదుగా బాధితులకు సహకారము అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ టి.వి. దేశ్ ముఖ మాట్లాడుతూ భగవంతుడు పెట్టిన పరీక్షలో ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలని, కష్టములకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పని చేస్తే భగవంతుని కృప వల్ల మనం త్వరగా కోలుకొంతామని చెప్పి వారందరికి మనో ధైర్యమును కలిగించారు.
గ్రామంలోని కమ్మరి, మంగలి మొదలగు వృత్తి పనుల వారికీ వారి పనిముట్లు కొనుగోలుకు ఆర్థిక సహకారం అందించడం జరిగింది.
సేవాభారతి కార్యకర్తలు గ్రామానికి 4, 5 సార్లు రావడం, అందరిని పలకరించడం, వారికీ ఈ విధంగా సహకరించడం చుసిన గ్రామ ప్రజలలో నూతన ఉత్సాహాన్ని నిర్మాణం చేసింది. కార్యక్రమం అనంతరం సర్వం కోల్పోయినప్పటికీ మీరందరూ మా దగ్గర భోంచేసి వెళ్ళాలని పట్టుబట్టి వారి దగ్గర భోజనం పెట్టించి పంపించారు.
విశేషం : గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ఉన్నా ఇల్లు మరియు దేవాలయం దగ్గర ఉన్నా వేపచెట్టు పూర్తిగా కాలిపోయాయి. కానీ దేవాలయానికి ఉన్నా పందిరి, తోరణాలు మరియు దేవాలయం పూర్తిగా యథాతథంగానే ఉన్నాయి. దేవాలయం మంటల మధ్య అట్లా ఉండటం అక్కడి ప్రజలకు ఆశ్చర్యమును కలిగించినది. ఇది అక్కడకు దగ్గరలో ఉన్నా ఆంజనేయ స్వామి అనుగ్రహం అని గ్రామస్తులు విశ్వశిస్తున్నారు.

No comments: