ఆధునికత పేరుతో అనర్ధాలు కొనితెచ్చుకుంటున్నాము

స్వాతంత్ర్యము సాధించుకొని 62 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ భావదస్యం నుండి బయట పడలేక పోవటం ఒక విచిత్రమైన విషయం. స్వాభిమానంతో వ్యవహరించటం నేర్చుకోవటంలో వెనక బడుతున్నాము. దానికి దారి తీసిన కారణాలలో "ఆధునికత" ఒకటి.
ఆధునికత పేరుతో ఈ దేశంలో ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు జరుగుతున్నా అనర్ధాలను మనం గుర్తించలేక పొతే మనం మన మూలల నుండి వేరుపడి విచ్చిన్నమై పోతాము. ఈ అనర్థాలను చక్కదిద్దేందుకు మనం ప్రయత్నం చేయాలనీ ప్రముఖ మనో విజ్ఞాన శాస్త్రవేత్త, బహు గ్రంథ కర్త, వివిధ దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న "ఆసిస్ నంది" ఈ మధ్య భాగ్యనగర్ వచ్చినప్పుడు చెప్పారు.
వివరాలు సంక్షిప్తంగా :
బ్రిటిష్ పాలకులు మన దేశంలో అమలు పరిచిన వలసవాదం విడిచి వెళ్ళిన అవసేశంగా నేను ఆధునికతకు గుర్తిస్తాను. ఆధునికత అనేది మన దేశ వాసులను మన సంప్రదాయం నుండి వేరు చేసింది. మన మూలల నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది. హేతువు పేరా, శాస్త్రం పేరా నవీన సంప్రదాయాన్ని సృష్టించి దానికి మనలను బానిసలను చేసింది. ఆంగ్ల విద్య, ఆంగ్లేయ వైద్యం, సంక్షేమం, అభివృద్ది, ఆర్ధిక పురోభివృద్ధి, మార్కెట్ రాజ్యం వంటి భావనలను ఆధిపత్య స్థానంలో ఉంచి వాటికి ప్రజలతో ఉడిగం చేయిస్తున్నది.
ఈ ఆధునికత సృష్టిస్తున్న అనర్ధాలు గతంలో సంప్రదాయాలు సృష్టించిన అనర్ధాలను మించి పోయి వలసవాద సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడి నెలలో, గాలిలో బలీయంగా నాటుకోకుండా చూడవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. మనదైన జీవన విలువలను గుర్తించి వాటిని వికశింప చేసుకొనేందుకు కృషి చేయాలి.


No comments: