విజయ దశమి నుండి సంక్రాంతి వరకు - కురుక్షేత్రం నుండి నాగపూర్ వరకు విశ్వ మంగళ గోగ్రమ యాత్ర
భారత దేశంలో బ్రిటిష్ పాలనా సమయం లోనే గోవధ శాలలు ప్రారంభమైనాయి. 50 సంవత్సరాల ముస్లింల పాలనలో కూడా గోహత్య లను ప్రోత్సహించలేదు. అనేక మంది దానిని నిషేధించారు. 1760 వ సంవత్సరం నుండి బ్రిటిష్ కాలంలోగో వధ శాలలు ప్రారంభమైనాయి. 1857 స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి గోహత్య నిషేధాన్నిప్రకటించడం గమనార్హం. ఆ తదుపరి ఆర్య సమాజ్ ప్రారంభించిన స్వామి దయానంద సరస్వతి 1881 నుండి 1894 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో గో సంరక్షణ ఆవశ్యకతను తెలియ చేస్తూగోకరుణ" అనే గ్రంథాన్ని రచించారు. దయానంద సరస్వతి ప్రారంభించిన గోసంరక్షణ ఉద్యమం ఉత్తర భారతంలోఉధృతంగా సాగింది. దానిలో అనేకమంది ముస్లిం పెద్దలు, పార్శీ పెద్దలు కూడా పాల్గొన్నారు. ఆ ఉద్యమం 14 సంవత్సరాల పాటు సాగింది. ఈ ఉద్యమంతో బ్రిటిష్ ప్రభుత్వం కదిలింది. బ్రిటిష్ రాణి విక్టోరియా వైస్రాయ్ తో చర్చించిముస్లింలు గోవులను చంపుతున్నారని, కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నదనే అభిప్రాయం తప్పు. అదిమనకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళన. అది మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణం కావచ్చు. కాబట్టి దానినిఅణచివేయాలని సూచించారు. ఆ తదుపరి ఆంగ్లేయ అధికారులు ఆ ఉద్యమాన్ని అణచివేశారు. హిందువులు - ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఏ చిన్న అవకాశం లభించినా బ్రిటిష్ వారు వదులుకోలేదు అని చెప్పేందుకుఇది ఒక ఉదాహరణ. 1917 వ సంవత్సరం అంటే దాదాపు 24 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీజీ బీహారులోమాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళు ప్రతి రొజూ 30,000 ఆవులను చంపుతున్నారని చెప్పారు. దీనిపై అభ్యంతరంతెలియచేశారు. ఆ తదుపరి స్వాతంత్ర్యానంతరం 1952 వ సంవత్సరంలో దేశంలో స్వామీజీల నాయకత్వంలో పెద్దయెత్తున సంతకాల సేకరణ జరిగింది. ఒక " కోటికి పైగా చేసిన సంతకాల పాత్రలను ఎడ్లబండిలో రాష్ట్రపతి భవనానికితీసుకువెళ్ళి డా.బబూ రాజేంద్ర ప్రసాద్ కు సమర్పించారు. అప్పటినుండి అప్పుడప్పుడు ఆందోళనలు జరుగుతూనేఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచి, గోవులను రక్షిస్తామని ప్రజల చేత ప్రమాణం చేయిస్తూ, గో ఆధారితవ్యవాసం, దాని వల్ల లాభాలు వివరిస్తూ ప్రజలలోకి వెళ్లేందుకు 150 సంవత్సరాల తరువాత మల్లి మరో ఉద్యమంప్రారంభం కాబోతుంది.
భారత దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి 62 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో మరో స్వాతంత్ర్యసంగ్రామం ప్రారంభించటానికి దేశంలో ప్రముఖులైన స్వామీజీలు నిర్ణయించారు.
ప్రముఖులైన స్వామీజీల సందేశాల సారాంశం :
భారత దేశం ప్రపంచానికి ఆత్మ వంటిది. గ్రామము భారత దేశము యొక్క ఆత్మ. వ్యవసాయం గ్రామానికి ఆత్మ. గోవు వ్యవసాయానికి మూలాధారం. అంటే గోవు ప్రపంచానికి ఆత్మ వంటిది. అటువంటి గోవు ఈరోజున ప్రపంచమంతట వదిన్చబడుతున్నది. రైతు పంటలు సరిగా పండక అప్పుల పాలై అత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా వినాశకర, విపత్కర మార్గంలో పయనిస్తున్నది. మనం ఆనందకరంగా జీవించాలంటే గోహత్యాలు అపబడాలి. దేశంలో రైతు ఆత్మగౌరవంతో నిలబడాలి. గ్రామాలు మల్లి కళకళలాడాలి. ఈరోజున ప్రపంచమంతా పర్యావరణ సమస్యలు పెరిగి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. భూసారం నష్ట్రపోతున్నది. వాతావరణ కాలుష్యం ఏర్పడింది. అడవులు ధ్వంసమై పోతున్నాయి. నీళ్లు కలుషితమయి పోతున్నాయి. ప్రకృతిలోని గాలి, నీరు, భూమి, అడవులను కాపాడుకోవడం ఈరోజు ప్రపంచంలోని మనందరి కర్తవ్యము. దీనికోసం ప్రక్రుతి నియమాలను కాపాడడం మనందరి కర్తవ్యం. అందుకే దేశంలోని ప్రముఖులైన స్వామీజీలు అందరు కదిలారు. గోమాతను రక్షించుకొంటూ తద్వారా ప్రకృతిని, ఈ సృష్టిని కాపాడుకుందాము. ఈ విషయాలను స్వయంగా తెలియాచేసెనదుకు స్వామీజీలు కదిలారు. "గోవును కాపాడు - దేశాన్ని రక్షించు" అనే నినాదంతో "విశ్వ మంగళ గోగ్రామ యాత్ర " ప్రారంభం కాబోతున్నది.
యాత్ర వివరాలు : యాత్ర సెప్టెంబర్ 28 వ తేది విజయ దశమి పర్వదినాన కురుక్షేత్రం నుండి ప్రారంభము కానున్నది. ఈ యాత్ర సంక్రాంతి పండుగ రోజున నాగపూర్ లో ముగించబడుతున్నది.
ఈ యాత్ర 108 రోజులు సాగుతుంది. 20,000 కిలోమీటర్లు తిరుగుతుంది. 400 ప్రసిద్ధ స్థలాలగుండా సాగుతుంది. ఈ యాత్ర కమిటి ఉపాధ్యక్షులు శ్రీ హుకుం చంద్ సనల్ యాత్ర మార్గం గురించి వివరిస్తూ "యాత్ర నలుగు శంకర పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు అనేక పుణ్య నదులు, ప్రవతలు సందర్శిస్తూ సాగుతుంది". ఈ యాత్రలో ఒక రథంలో గోమాత విగ్రహము, రెండవ రథంలో గోమాతకు సంబంధించిన సాహిత్యమూ, గ్రామాభివృద్ధికి గోవు యెట్లా ఆధారం వివరించే సాహిత్యం తదితరములు, మూడవ రథంలో స్వామీజీ ఉంటారు. ఈ కార్యక్రమానికి రాందేవ్ జీ బాబా, మాతా అమృతానందమయి, గోకర్ణ పీఠాధిపతి రాఘవేశ్వరభారతి, స్వామి దయానంద సరస్వతి, సంత మురారి బాపు, ఆచార్య మహాప్రదాన, గాయత్రీ పరివార్ స్వామీజీ ప్రణవ్ పాండ్య తదితర అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. స్వామీజీలందరూ దేశ ప్రజలకు "గో రక్షణ వైపు మల్లండి, గోవును కాపాడండి, గ్రామా స్వరాజ్యం సదిద్దము, రామ రాజ్యం నిర్మాణం చేద్దాము" అని పిలుపునిస్తారు. గ్రామాలలో ప్రజలందరి చేత గోవును కాపాడటము, ఎట్టి పరిస్థితులలోను గివును కోటకు అమ్మము అని ప్రతిజ్ణ చేయించబోతున్నారు. ప్రధాన యాత్రతో అనుసంధానం చేసుకుంటూ ఉప యాత్రలు ఉంటాయి. అటువంటివి దేశ వ్యాప్తంగా 15,000 వుంటాయి. ఈ యాత్ర దేశమంతట ఒక లక్ష కేలోమీటర్లు సాగుతుంది. ఈ సమయంలో గో సంరక్షణకు సంతకాల సేకరణ జరుగుతుంది. ఆ సంతకాలను ప్రధాన రథంలో వచ్చే స్వామీజీకి ఇవ్వటం జరుగుతుంది. దేశంలోని 5 లక్షల గ్రామాలలో సంతకాల సేకరణ చేయబడుతుంది. సుమారుగా 21 కోట్ల మందితో సంతకాల సేకరణ చేయాలనీ సంకల్పం. ఈ సంతకాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అందచేస్తారు. దేశమంతట గోహత్యను నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేయటం జరుగుతుంది. 50 కోట్ల మందో ప్రజల చేత గ్రామీణ సంస్కృతిని కాపాడుకుంతము, గో సంరక్షణ చేస్తామని ప్రతిజ్ణ చేయిస్తారు. ఈ యాత్ర గోభాక్తులు, స్వమీజీలతో నిర్వహించ బడుతుంది. గోవును ఎందుకు పెమించాలో వివరిస్తారు. గో ఆధారిత వ్యవసాయం, పండ్లు, కూరగాయలు యెట్లా పండించుకోవలో వివరిస్తారు. కుటుంబాలు గోప్రేమిక కుటుంబాలు కావాలి. ప్రతిరోజూ ఎవరు గోవును పోషిస్తారో అటివంటి వారిని గోశాలల ఏర్పాటుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఒక ప్రదర్శన శాల, వీడియొ, ఆడియో ల ద్వారా ప్రజలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక భవ్యమైన జాగరణ కార్యక్రమ ప్రయత్నాలు చాల వేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలలో మనమందరం పాల్గొని యాత్రను విజయ వంతం చేద్దాము.
గో వంశ రక్షణకు కదిలిన స్వామీజీలు
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
poratam sphurthydayakam.. abhinandanalu. kaani.. ee desa mulaalanu kapaadataniki hindu samsthalu cbesthunna krushi saripotunda? jaatinantatini ekam cheyataniki o maha bharata yuddham cheyali. anduku desam lo sainyam undi.. vaariki astraalu itche vaaru leru.. anduku ee samsthalu em chestayi.. migata vaalla laga ante rajakiya partillo laga dharnalu cheyatam, yatralu cheyatam to saripotunda? hidu ni hindu samsthalu kuda bhavinchinanta kaalam hinduvulaku vimukti kalugadu.. ee desa prajalandarini oka jaatiga mundu hindu samsthalu gurteragali. jaatini ekatritam cheyali.. muslim antu, christian antu artham leni vadalato pani kaadu. jaatini okati cheyatam kevalam ee samsthala vallane avutundi. daanni avi grahinchatam ledu..ee desam loni prajalanta.. idi naa desham ani manaspurthiga anukunela cheyagalagali. tama mulaalu emito grahinchali.. appudu sanatana dharmanni kapadataniki e poratam cheyanakkaraledu.. prajalandarini ekam chesinappudu palakulu vaarantata vare digivastaru.
bharatmataki jai.
Please don't call Gandhi Mahatma .
There are letters written by Gandhi on how Hindu's should not object to muslims killing Cows
Post a Comment